వామనరావు దంపతుల మర్డర్‌పై పుట్ట మధు..ఏమన్నాడంటే

మంథిని:మాజీమంత్రి ఈటల రాజేందర్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే సమాచారంతో పుట్ట మధుపై సర్కార్ ఫోకస్ చేసింది.పాత కేసులను తోడుతుంది.ఇటీవల జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు హత్య గురించి పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.కేసు విచారణలో మధు కీలక విషయాలను తెలియజేశారు.మూడురోజుల పాటు మధును పోలీసులు విచారించారు.ప్రధానంగా వామనరావు దంపతుల హత్య సంబంధంపై ఆరా తీశారు.పో లీసుల విచారణలో మధు కుండ బద్దలు కొట్టీ మరీ చెప్పినట్టు తెలుస్తోంది.హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడని సమాచారం.కుంట శ్రీను తన మేనల్లుడు బిట్టు శ్రీను హత్య చేసి ఉంటారని వివరించారు.ఈ కేసు విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని మధు తెలియజేశారు.నడి రోడ్డు మీద వామనరావు దంపతులు హత్యకు గురయ్యారు.కుంట శ్రీను,బిట్టు శ్రీనులే మర్డర్ చేశారని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.అయితే వీరి వెనక మాత్రం పుట్ట మధు ఉన్నారనే సంగతి జగమెరిగిన సత్యం.ఈ క్రమంలో పుట్ట మధును పోలీసులు విచారించారు.పైకి కేసు విచారణ కాగా లోన మాత్రం ఈటల రాజేందర్‌తో లావాదేవీల వల్లే ఎంక్వైరీ జరుగుతుందని ప్ర చారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here