షర్మిల తెలంగాణ పార్టీకి 9మంది అధికార ప్రతినిధులు

హైదరాబాద్:తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి సరికొత్త రాజకీయానికి తెరతీస్తోన్న వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు.అడపాతడపా అధికారపార్టీపై విమర్శలు గుప్పిస్తోన్న షర్మిల ఇటీవల క్ష్రేత్తస్థాయి పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.తాజాగా తను తెలంగాణలో స్థాపించబోయే పార్టీకి తొమ్మిది మంది అధి కార ప్రతినిధులను నియమించారు షర్మిల.వీరిలో ఇందిరా శోభన్,సయ్యద్ ముజ్జాద్ అహ్మద్,పిట్ట రాంరెడ్డి,కొండా రాఘవరెడ్డి,ఏపూరి సోమన్న,తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్,మతిన్ ముజాదద్ది,భూమిరెడ్డి ఉన్నారు.వీరిని పార్టీ అధికార ప్రతినిధులుగా పేర్కొంటూ షర్మిల కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.మరోవైపు షర్మిల పార్టీని జులై 8న వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటించబోతోన్న సంగతి విదితమే.ఇక షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)గా ఖరారైంది.ఇటీవల షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఈ పార్టీ పేరును రిజిస్టర్ చేయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here