ఆప్తుల కోసం కాదు..ఆస్తుల కోసమే ఈటల ఆరాటం:ఎమ్మెల్సీ పల్లా

హైదరాబాద్:మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ స్టార్ట్ చేశారు.ఎమ్మల్యే పదవికి,టీఆర్ఎస్‌ సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు.రాజేందర్ వ్యవహారం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.2003లో ఈటల రాజేందర్‌కు గెలిచే బలం లేకపోయినా కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి హుజురాబాద్‌లో గెలిపించారని ఎమ్మెల్సీ పల్లా రాజేందర్ రెడ్డి తెలిపారు.టీఆర్ఎస్ ‌లో ఈటలకు ఇచ్చిన గౌరవం మరెవరికి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.ఆస్తుల కోసమే ఈటల పార్టీ మారారని,ఆప్తుల కోసం కాదని పల్లా పేర్కొన్నారు.వైద్యారోగ్య శాఖ మం త్రి పదవి ఇచ్చి ఈటలను సీఎం కేసీఆర్ గౌరవించారన్నారు.రైతు బంధుపై ఈటల చేసిన వ్యాఖ్యలు అవగాహన లేమి అని కొట్టి పారేశారు.ఆస్తుల మీద ప్రేమతో ఆత్మ గౌరవం అనే పదాన్ని ఈటల ఇప్పుడు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.ఈటల కల్లబొల్లి మాటలను తెలంగాణ వాదులెవరు నమ్మరన్నారన్నారు.సీఎం కేసీఆర్,టీఆ ర్ఎస్ పార్టీపై అవాకులు,చవాకులు పేలితే ఊరుకునేది లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.మంత్రిగా ఉండి దేవాదాయ,అసైన్డ్ భూములు ఎలా కొన్నారని ఆయ న ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here