భూకుంభకోణాలపై ప్రశ్నించినందుకే రఘు అరెస్ట్:పాశం యాదగిరి

హైదరాబాద్:ర్నలిస్ట్ రఘు అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పాత్రికేయ లోకం ఆయన అరెస్ట్‌ను ముక్తంకంఠంతో ఖండి స్తోంది.రూ.75 వేల కోట్ల భూకుంభకోణాలపై ప్రశ్నించినందుకే రఘును అరెస్ట్ చేశారని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన అరెస్ట్‌తో ఈ అక్రమాలను మరుగున పడేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.కోకాపేట కాందీశీకుల భూమి కుంభకోణం విలువ రూ.50 వేల కోట్లు ఐడీపీఎల్ భూకుంభకోణం రూ.20 వేల కోట్లు,ఐకియా ముందు భూ కుంభకోణం రూ.5 వేల కోట్లు అని పాశం చెప్పారు.ఈ కుంభకోణాలను ప్రశ్నించినందుకే రఘును అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.ఈ వేల కోట్ల దోపిడీని చూస్తూ మౌనంగా ఊరుకుందామా అని ప్రశ్నించారు.ఈ కుంభకోణాలపై కాంగ్రెస్,బీజేపీ నేతలు కూ డా నోరు మెదపడం లేదని’హోల్ సేల్’గా అమ్మడుపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం తీరు చూస్తోంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాట గుర్తోస్తోం దన్న పాశం తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు.మీడియా మేనేజ్‌మెంట్ చేస్తూ ప్రభుత్వం తన అక్రమాలను సజావుగా సాగించుకుం టోందని విమర్శించారు.తెలంగాణలోని జర్నలిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here