19 ఏళ్ల అనుబంధానికి ఈటల రాజీనామా:కేసీఆర్ పాలనలో మంత్రి పదవి బానిస కంటే దారుణం..

హైదరాబాద్:మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆ యన ప్రకటించారు.శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ఈటల ప్రకటించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోప ణలు చేశారు.బతికి ఉండగానే బొందపెట్టమని కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వాపోయారు.సీఎం కేసీఆర్‌కు తనకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ ఉందని మంత్రి హరీష్ రావుకు కూడా ఇవే అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.కేసీఆర్ పాలనలో మంత్రి పదవి బానిస కంటే దారుణంగా అయిందని మండిపడ్డారు.ప్రగతిభవన్‌ను బాని స నిలయంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌పై ఎదురు దాడికి దిగారు ఈటల రాజేందర్.నా వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి తొలగించారు.కనీసం ఏం జ రిగిందో తెలుసుకోకుండా విచారణకు ఆదేశించారు.పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను.కానీ నన్ను బతికి ఉండగానే బొందపెట్టమని హరీష్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశించా రు.నియోజకవర్గ ప్రజలను డబ్బులిచ్చి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.నాకు జరిగిన అన్యాయాన్ని చూసి ప్రజలు కూడా బాధపడుతున్నారు.కుట్రలను తిప్పి కొడతామని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మేం మళ్లీ గెలిపించుకుంటామని చెప్పారు.అందుకే ఎ మ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా.19 ఏళ్ల టీఆర్ఎస్ అనుబంధానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.కేసీఆర్ తన సొంత కూతురికి కూడా బీఫామ్ ఇచ్చారు. కానీ ఆమె ఓడిపోయారు.ఈటల రాజేందర్ అనే కార్యకర్త ఎప్పుడు కూడా ఓడిపోలేదని ఈటల రాజేందర్ అన్నారు.నల్గొండ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఈటల రాజేంద్ అన్నారు.సీఎం కేసీఆర్ డబ్బును అణచివేతను కుట్రను నమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.ఆయన కుట్ర లను తిప్పికొడతామని హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టుకోరని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. డబ్బులతో హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిస్తే గెలవచ్చని కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మబోరని ఆయన అన్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో పాటు మరో ఇద్దరు తెలంగాణ నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు.ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మే ల్యేగా పనిచేసిన ఏనుగు రవీందర్ రెడ్డి,ఇంకా తుల ఉమా కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.గత కొన్ని రోజులుగా ఈటల రాజేం దర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈరోజు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి,ఎమ్మేల్యే పదవికి రాజీనా మా చేస్తున్నానని ప్రకటించారు.రాజీనామా అనంతరం ఈటల రాజేందర్,కేసీఆర్ పై అనేక విమర్శలు చేసారు.మంత్రి పదవిలో ఉండి కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని మూడు సార్లు ప్రగతి భవన్ కి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని,అది ప్రగతి భవన్ కాదని,బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని అన్నా రు.కేసీఆర్ కేబినేట్ లో అందరూ బానిసలుగానే ఉండాలని నాకే కాదు హరీష్ రావుకి కూడా అవమానాలు ఎదురయ్యారని అన్నారు.ఇదలా ఉంటే రాజీనామా అనం తరం భవిష్యత్ కార్యచరణ ఎలా ఉంటుందనే విషయమై ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here