హైదరాబాద్:తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతరు వైఎస్ షర్మిల.మరోవైపు వివిధ జిల్లాల అ నుచరులు వైఎస్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు.ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీక్షలు కూడా చేశారు.త్వరలోనే పార్టీ పేరు జెండా అ జెండా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.అయితే వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరుపై ఓవైపు ప్రచారం జరుగుతున్నా సోషల్ మీడియాలో ఖాతాలో అదేపేరుతో దర్శనమిస్తున్నా.పార్టీ పేరు ప్రకటించే వరకు వేచిచూడాల్సిందేనని అభిప్రాయాలను కూడా కొంతమంది వ్యక్తం చేశారు.మొత్తంగా వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఫైనల్ అయ్యింది.ఇదే పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశారు షర్మిల ముఖ్య అనుచరుడు వాడుక రాజగోపాల్ అంతేకాదు.వైఎస్సార్ తె లంగాణ పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపలని ఓ జాతీయ పత్రిక లో ప్రకటన కూడా ఇచ్చారు.ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.
