ఆరుగురు ఎంఎల్‌సిలకు వీడ్కోలు..ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి

హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది.దీంతో ఆయన స్థానంలోశాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా టీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు.శుక్రవారం నుంచి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి వ్యవహరిస్తారు. మండలికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతారు.మండలి చైర్మన్ గుత్తాతో పాటు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్,మరో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,ఆకుల లలిత,బోడకుంటి వెంకటేశ్వర్లు,ఫరీదుద్దీన్‌.మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం గురువారంతో ముగిసింది. మరోవైపు ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే తేల్చి చెప్పడంతో అప్పటివరకూ ప్రొటెం చైర్మనే మండలి వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.సాధారణంగా మండలి చైర్మన్‌కు ఉన్న అన్ని అధికారాలూ ఆయనకు ఉంటాయి.ఇదిలా ఉంటే మండలికి కొత్త చైర్మన్‌గా పీవీ కూతురు టీఆర్ఎస్ ఎమ్మె ల్సీ సురభి వాణీదేవిని ఎన్నుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here