హైదరాబాద్:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుని ఎంపిక వ్యవహారం పార్టీలో కలకలం లేపుతోంది.ముఖ్యంగా ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారైందని,ఢిల్లీ నుంచి సమాచారం అందుతున్న నేపధ్యంలో గతంలో ఒక సారి రేవంత్ రెడ్డి ఆశలపై అగ్గినీళ్లు చల్లిన పాత కాపులు మళ్ళీ మ రోసారి ఆయనకు పీసీసీ పీఠందక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హను మంత రావు రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి,పీసీసీ అధ్యక్ష పద వి ఎలా ఇస్తారని నేరుగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీనే ప్రశ్నించారు.ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ రాసిన వీహెచ్,రేవంత్ పై కేసులున్నాయని రేపు అయన జైలుకు పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.అంతే కాదు 44 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనను,నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అనుచరు లు ఫోన్ చేసి బెదిరిస్తునారని,బూతులు తిడుతున్నారని,రేపు అయన పీసీసీ చీఫ్ అయితే పార్టీ సీనియర్ నాయకులకు గాంధీ భవన్’లో ఎంట్రీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.వీహెచ్ పార్టీ మీద కూడా మండిపడ్డారు.రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పిెచాలని పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని అయినా పీసీసీ నేతలు ఎవరు రేవంత్ అనుచరుల బహిరంగ హెచ్చరికలను ఖండించలేదని అన్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...