జూన్ 8న బీజేపీలోకి ఈటెల

హైదరాబాద్:మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది.జూన్ 8వ తేదీన బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఈటల రాజేందర్‌.అయితే రేపు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు.నాలుగురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన ఈటెల ఈ రోజు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.అయితే ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి,కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ తుల ఉమతో పాటు మరికొంతమంది ముఖ్యనాయకులు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తన సతీమణి జమునను పోటీలో నిలపాలని రాజేందర్ భావిస్తున్నారు.అయితే ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వం సూచన మేరకు ఈటల రాజేందర్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here