కోల్‌కతా:పశ్చిమ బెంగాల్‌లో 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరాలని కోరుకుంటున్నట్లు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.కొందరు బీజేపీ నాయకులు తమతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నారని టీఎంసీ నేతలు పేర్కొన్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరిన మాజీ టీఎంసీ నాయకులు ఘర్ వాపసీ (సొంత ఇంటికి తిరిగి రావాలని) మమతాబెనర్జీ పిలుపునిచ్చారు.దక్షిణ 24 పరగణాలలోని సత్గాచియాకు చెందిన నా లుగుసార్లు శాసనసభ్యుడైన గుహా మమతాబెనర్జీకి లేఖ రాశారు.చేపలు నీటి నుంచి బయటపడలేవు మీరు లేకుండా నేను జీవించలేను అని దీదీకి రాసిన లేఖలో రాశారు.బీజేపీలో చేరిన టీఎంసీ వ్యవస్థాపకుడు ముకుల్ రాయ్ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ వచ్చి పరామర్శిం చారు.ముకుల్ రాయ్ కొడుకుతో అభిషేక్ మాట్లాడిన తరువాత బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలోకి రావడంపై ఊహాగానాలు వచ్చాయి.దీంతో రాయ్ భార్య ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేశారు.బీజేపీని సంస్థాగతంగా బలహీన పర్చడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన తన పార్టీ మాజీ నేతలను ఘర్ వాపసీ పేరిట టీఎంసీలోకి చేర్చుకుంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.మొత్తం మీద పశ్చిమబెంగాల్ లో టీఎంసీ ఘన విజ యం అనంతరం ఘర్ వాపసీ నినాదం చర్చనీయాంశంగా మారింది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...