బాక్సింగ్ లో విశ్వ విజేత తెలంగాణ బిడ్డ..నిఖత్ జరీన్

నిజామాబాద్:తెలంగాణ బిడ్డ ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో చరిత్ర సృష్టించింది.టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిర్వహిస్తున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో యు వ బాక్సర్ నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర లిఖించింది.ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఫైనల్స్‌లో గెలిచి తెలుగు నేల సత్తా చాటింది.థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌పై ఘన విజ యం సాధించింది.కాగా సెమీఫైనల్లో నిఖత్ జరీన్ బ్రెజిల్‌కు చెందిన కారలిన్‌ డీ అల్మెదాపై 5-0 తేడాతో సునాయాసంగా గెలుపొందింది.తెలంగాణలోని నిజామాబాద్‌కు జిల్లాలో 14 జూన్ 1996 న పుట్టారు నిఖత్‌ జరీన్‌.ఆమె తల్లిదండ్రులు ఎండి జమీల్ అహ్మద్,పర్వీన్ సుల్తానా.13 ఏళ్ళ వయస్సులోనే బాక్సింగ్‌ రింగులోకి దిగిన నిఖత్‌కి తండ్రి ప్రోత్సాహం అంతులేని ఉత్సాహాన్నిచ్చింది.హైద రాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీస్‌ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది.విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బాక్సింగ్‌ శిక్షణ తీసుకుంది.ప్రతిష్టాత్మక ‘ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం మనస్ఫూర్తిగా అభినం దించారు.ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని సీఎం అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రో త్సహిస్తున్నదని,తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి,యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం ఈ సందర్భంగా తెలి పారు.

May be an image of 1 person and indoor

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here