వామ్మో కిడ్నీలో 206 రాళ్లు..తొల‌గించిన వైద్యులు..

హైదరాబాద్:హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.నల్గొండకి చెందిన వీరమల్ల రామ లక్ష్మయ్య కిడ్నిలో భరించలేని నొప్పి రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.ఈ క్రమంలో టెస్టులు చేసి లెఫ్ట్ కిడ్నీలో రాళ్లున్నట్టుగా గుర్తించారు.అయితే వీటిని గంటపాటు కీహో ల్ సర్జరీ చేసి వీటిని తొలిగించారు.రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు.రామలక్ష్మయ్య గతంలో కూడా పలుమార్లు ఈ నొప్పి వచ్చేది.స్థానిక హెల్త్ ప్రాక్టిషనర్ దగ్గర చికిత్సతో తాతాల్కిక ఉపశమనం పొందేవాడు.కానీ ఈ సమస్య ఎక్కువ కావడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరాడు.వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్‌ కేసులు పెరుగుతున్నా యని,దీని ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు.వేసవికాలంలో ఎక్కువ నీరు,కొబ్బరి నీరు (వీలైతే) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here