దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమే:సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

ఢిల్లీ:దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వి.ఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది.ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.ఈ వ్యవహారంలో పోలీసులపై హ త్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌ అభిప్రాయపడింది.నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంటూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో జస్టిస్‌ వి.ఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది.పోలీసులు వి.సురేందర్‌,కె.నర్సింహారెడ్డి,షేక్‌ లాల్‌ మాధర్‌,మహమ్మద్‌ సిరాజుద్దీన్‌,కొచ్చెర్ల రవి,కె.వెంకటేశ్వర్లు,ఎస్‌ అర్వింద్‌ గౌడ్‌,డి.జానకి రామ్‌,ఆర్‌ బాలూ రాఠోడ్‌,డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది.ఈ పదిమంది పోలీసులపై ఐపీసీ 302,రెడ్‌ విత్‌ 34,301,రెడ్‌ విత్‌ 302,34 సెక్షన్ల కింద విచారణ జరపాలని నివేదికలో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here