ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్..కేంద్రం కీలక ఆదేశాలు జారీ

హైదరాబాద్:కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదలివెళ్లలేదు.2020 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది.ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇం కా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి.తాజాగా కొత్త వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది.అదే మంకీపాక్స్.మే7న మొదటి మంకీ పాక్స్ కేసు లండన్ లో నమోదైంది.నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఈ మంకీపాక్స్ సోకింది.ఆ తర్వాత అమెరికా,స్పెయిన్,పోర్చుగల్,ఇటలీ,యూఎస్,స్వీడన్, కెనడా దేశాల్లో కూడా ఇటీవల అరుదైన మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదవడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఫ్రాన్స్,జర్మనీ,బెల్జియం,ఆస్ట్రేలియా దేశాల్లో శుక్రవారమే మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి.కాగా,అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలు గులోకి రావడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఆఫ్రికా దేశానికి వెళ్లని వారిలోనూ కేసులు నమోదు కావడంపై అయోమయం వ్యక్తం చేస్తున్నారు.పశ్చిమ ఆఫ్రికాలో కూడా వైరస్ ఇలా వ్యాపించలేదని ప్రముఖ వైరాలజిస్ట్ ఒయ్​వాల్ తొమోరి తెలిపారు.వైరస్​లో ఏదో మార్పులు సంభవించి ఉండొచ్చని అన్నారు.మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది.పరిస్థితిని నిరంత రం కన్నేసి ఉంచాలని ఐసీఎంఆర్​,సీడీసీలకు ఆదేశాలు జారీ చేసింది.మంకీపాక్స్ కేసులు బయటపడ్డ దేశాల నుంచి వచ్చిన,ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు ప్రయాణికులు తమకు లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ఐసోలేషన్​కు వెళ్లాలని సూచించింది.ఈ ప్రయాణికుల నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్​కు పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.అమెరికా,బ్రిటన్,పోర్చుగల్,స్పెయిన్ సహా పలు ఐరోపా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాపి నేపథ్యంలోనే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తాజా ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలిపారు.
అసలేంటీ వైరస్‌?
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి.ఇది కూడా స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే.అంటే మనదేశంలో తట్టు,అమ్మవారిలానే ఇది కూడా కనిపిస్తుంది.ఈ వైరస్‌ను మొదట 1958లో మొదటిసారి కోతు ల్లో గుర్తించారు.అందువల్ల దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది.ఆ తర్వాత మనుషులకు సోకింది.1970ల్లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు.జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.అం దులోనూ ఎక్కువగా ఎలుకలు,చంచులు,ఉడతల నుంచి వ్యాపిస్తుంది.ఈ మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా మధ్య,పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకు తుంది.గాలి తుంపర్ల ద్వారా,వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.మంకీపాక్స్ వ్యాధి ఎవరికైనా సోకిన తర్వాత శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సుమారు 6 నుంచి 13 రోజుల సమయం పడుతుంది.ఒక్కోసారి 21 రోజులు సమయం తీసుకుంటుంది.*లక్షణాలు*మంకీపాక్స్ సోకిన వారిలో స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం,కాళ్లుచేతులపై బొబ్బలు,దద్దుర్లు కనిపిస్తాయి.ఒక్కోసారి శరీరమంతా వ్యాపిస్తాయి.జ్వరం,తలనొప్పి,నడుము నొప్పి,కండరాల నొప్పి,వాపు,అలసట ఉంటుంది.కొందరిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు.ఈ వ్యాధి బారినపడిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు.తక్కువ మందికి మాత్రమే ప్రాణాపాయంగా ఉంటుంది.ప్రతి 10 మందిలో ఒకరికి మంకీపాక్స్ ప్రాణాంతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వ్యక్తిగత శుభ్రత పాటిచాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here