ఆ..తహశీల్దార్‌పై రైతు డీజిల్ ఎందుకు పోశాడంటే..?

మెదక్:రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఓ రైతు కోపంతో తనపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా ఆపై తహశీల్దార్‌పై కూడా డీజెల్ పోసి హత్యాయత్నం చేయబోయాడు.పక్కనే ఉన్న రైతులు అప్రమత్తం అవ్వడంతో ఎవరికి ఏమీ కాలేదు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఘట న వివరాల్లోకెళితే తాళ్లపల్లిగడ్డ తండాకు చెందిన మాలోతు బాలు అనే రైతు విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడు.అయితే ఆ రైతుకు సకాలంలో తహశీల్దార్ భానుప్రకాశ్ ప ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో రైతు బీమా నగదు పొందలేకపోయారు.దీంతో ఆగ్రహంచిన మరో రైతు గ్రామంలోని మిగిలిన రైతులతో కలిసి మండల ఆఫీ సుకు చేరుకున్నారు.తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు.తహశీల్దార్‌ నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందంటూ రైతులు కోపోద్రిక్తు లయ్యారు.ఇదే క్రమంలో ఓ రైతు వెంట తెచ్చుకున్న డీజిల్‌ బాటిల్‌ను ముందుగా తనపై పోసుకున్నాడు.అప్పటికే రైతులను తహశీల్దార్‌ సముదాయించే యత్నం చే స్తున్నారు.అయినా వినిపించుకోలేదు.ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగే క్రమంలో ఆ రైతు మిగతా డీజిల్‌ను తహశీల్దార్‌పై పోశాడు.ఈ ఘటనతో ఒక్కసారిగా కా ర్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రైతు విద్యుదాఘాతంతో మృతిచెందడంతో ఇప్పుడా కుటుంబం వీధిన పడిందని వాపోయారు రైతులు.ఆ కుటుంబా నికి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని గ్రామస్థులతో కలిసి ఆందోళనకు దిగారు.నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here