బెంగాల్ లో ఇలా జరిగిందేందబ్బా..

న్యూఢిల్లీ:పశ్చిమబెంగాల్‌లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది.దాదాపు రెండేండ్ల కిందటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమైంది.కైలాస్‌ విజయవర్గీ య,శివప్రకాశ్‌,అరవింద్‌ మీనన్‌ వంటి సీనియర్‌ నాయకులను రాష్ర్టానికి పంపింది.కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా బెంగాల్‌పై ప్రత్యేక దృష్టిసారించారు.హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా జాతీయనేతాగణమంతా విస్తృతంగా పాల్గొన్నారు.ప్రధాని దాదాపు 20 సభల్లో పాల్గొనగా,అమిత్‌షా 50 సభలకు హా జరయ్యారు.రాజ్‌నాథ్‌,స్మృతీ ఇరానీ,ధర్మేంద్ర ప్రదాన్‌,యోగి ఆదిత్యనాథ్‌ వంటి నేతలు కూడా విస్తృతంగా పర్యటించారు.మరోవైపు సువేంధు అధికారి సహా తృణమూ ల్‌లోని ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకున్నారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం గణనీయంగా పెరిగింది.అయినప్పటికీ పార్టీ అనుకున్న ఫలితాలను సా ధించలేకపోయింది.ఇతర పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడం దెబ్బతీసిందని,పార్టీలో ముందునుంచీ ఉన్నవారిలో ఇది అసమ్మతి రగలించిందని పార్టీ నేతలు చెప్తున్నారు.మమత కాలిగాయంపైనా తీవ్ర విమర్శలు చేయడం వ్యతిరేక ప్రభావం చూపింది.ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఒక్కో విడుతపై ప్రత్యేక దృష్టిసారిచాలన్న వ్యూహం కూడా బెడిసికొట్టిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నారు.పోలింగ్‌ తొలి దశల్లో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు రాగా,కరోనా సెకండ్‌వేవ్‌ తీ వ్రంగా ఉన్న చివరి దశల్లో ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కరోనా రెండో వేవ్‌ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఓటింగ్‌పై ప్రభావం చూపింది.చివరి మూడు విడుతల్లో ప్రధాని మోదీ తదితర కీలక నేతలు ప్రచారాన్ని రద్దు చేసుకోవడం లేదా వర్చువల్‌ మాధ్యమంలో నిర్వ హించడం ప్రభావం చూపింది.ఇదే సమయంలో మమత విస్తృత ప్రచారం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here