కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొత్త వేదిక..ఏర్పాటు?

హైదరాబాద్:సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం తక్షణమే అమ ల్లోకి వస్తుందని గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది.రైతుల ఆరోపణలు,కలెక్టర్‌ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈటలను సీఎం మంత్రివర్గం నుండి తొలగించారు.నే పథ్యంలో ఈటల రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రస్తుతం రజాకీయ వర్గాల్లో,రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారింది.పైగా పూర్తిగా కేసీఆర్‌నే తప్పుబడు తూ ఈటలపై సానుభూతి చూపిస్తున్నారు.ఈ పరిణామం ఇప్పుడు ఈటలకు పెద్ద బలంగా మారడంతో పాటుగా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంద న్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.కేసీఆర్ ఇంత అవమానించాక ఈటల టీఆర్ఎస్‌లో ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు.అయితే బయటకు వస్తే ఏం చేస్తారు.ఇతర పా ర్టీల్లో చేరతారా లేక కొత్త పార్టీ పెడతారా అన్న ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది.ఇప్పటికే ఈటలను తమగూటికి లాక్కునేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నాలు కూడా ఆరంభించాయి.మరోవైపు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కూడా ఆయనతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా కనిపిస్తున్నారు.ఇక కొత్త పార్టీ పెట్టాలా లేక ఇతర పార్టీలో చేరాలా అని తెలియక సతమతం అవుతున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అయితే ఈటల కోసమే వెయిట్ చేస్తున్నారు.ఈటల బయటకు వస్తే ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమని గతంలోనే ప్రకటించారు.ఇప్పటికే తెలంగాణ యువసేన పార్టీ అధ్యక్షుడు అడప సురేందర్,ఇంటి పార్టీ అధినేత చెరుకు సు ధాకర్,తీన్మార్ మల్లన్న వంటి వారితో ఓ గట్టి కూటమిని తయారు చేయాలని అనుకుంటున్నట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.కొండా.తెలంగాణలో ముదిరాజ్,రెడ్డి, మున్నూరు కాపు వంటి సామాజిక వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం,వీరు ఆయా వర్గాలకు చెందిన నేతలు కావడంతో రాజకీయంగా బాగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.వీరికి ఈటల కూడా తోడైతే మంచి బలం వస్తుందని భావిస్తున్నారు.ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు.అయితే ఈటలనే ఇంకా ఏదీ తేల్చుకోలేదు.ఏదైనా ఈటెల నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here