ఈటలపై కలెక్టర్ నివేదిక-అంతా తప్పుల తడకే..!

హైదరాబాద్:మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాకు పాల్పడ్డారంటూ మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక పూర్తిగా తప్పులతడకగా ఉంది.ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు కోసం నివేదికలో ఏం రాస్తున్నారో కూడా పట్టించుకోలేదు.ముఖ్యమంత్రి పెట్టిన గడువు కంటే ముందే ఇచ్చేయాలన్న తొందరలో రిపోర్ట్‌లో కలెక్టర్ పలు తప్పిదాలకు పాల్పడ్డారు.ఈటల రాజేందర్ కుటుంబలో ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా పట్టించుకోలేదు.ఈటల సతీమణి జమున పేరు ప్రస్తావించే చోట నిర్లక్ష్యంగా రిపోర్ట్ చేశా రు.ఈటల కుమారుడు నితిన్ రెడ్డిని జమున భర్తగా ప్రస్తావించారు.నితిన్ రెడ్డి తల్లిని ఆయనకు భార్యగా మార్చేశారు.ఈ రిపోర్ట్‌లో నితిన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు.కానీ మధ్యలో ఆయన పేరు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.ఇక మరో చోట సంతకం చేసి దాని కింద తేదీని తప్పుగా రాశారు.1\5\21 బదులుగా 1\6\21 అని వేశారు.ఒక మంత్రి అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో ఏకంగా కలెక్టరే ఇన్ని తప్పులు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.తల్లికి భార్యకి తేడా తెలియకపోతే ఎలా అని పలువురు మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here