సంగ్లీ:మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా పడి ఉన్నారు.వారంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.సంగ్లీ జిల్లాలోని మైసల్ ప్రాంతానికి చెందిన మాణిక్ వన్మోర్ స్థానికంగా వెటర్నరీ వైద్యుడిగా పనిచేస్తున్నారు.ఆయన తమ్ముడు పో పత్ వన్మోర్.వీరిద్దరూ తమ కుటుంబాలతో కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నారు.సోమవారం ఉదయం వీరి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంటి తలుపులు కొట్టారు.లోపలి నుంచి ఎవరూ డోర్లు తీయకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా నేలపై మృతదేహాలు కన్పించాయి.దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు.ఘటనపై సంగ్లీ ఎస్పీ దీక్షిత్ మాట్లాడుతూ ”మూడు మృతదేహాలు ఒక చోటు ఆరు మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల ఉన్నట్లు గుర్తించాం.వీరంతా ఆహారంలో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలున్నాయి.అయితే మూకుమ్మడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.దానిపై దర్యాప్తు చేస్తున్నాం” అని వెల్లడించారు.అప్పుల బాధతోనే వీరంతా బలవన్మరణానికి పాల్పడి ఉం టారని ప్రాథమిక సమాచారం.మృతుల్లో మాణిక్,ఆయన తల్లి,భార్య,ఇద్దరు పిల్లలు,పోపత్,ఆయన భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.కాగా ఈ ఘటన దిల్లీలో బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన ను గుర్తుచేస్తోంది.కొన్నేళ్ల క్రితం బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకే ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచల నం సృష్టించింది.అయితే మోక్షం కోసం వారంతా సామూహికంగా ప్రాణాలు తీసుకున్నట్లు తర్వాత దర్యాప్తులో వెల్లడైంది.