మంత్రి హామీతో..ఆందోళన విరమించిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన విరమించారు.గత వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ లో 12 అంశాలను వైస్ ఛాన్సిలర్,డైరెక్టర్ నియమించాలని కూడిన సమస్యలపై శాంతియుతంగా విద్యార్థుల విన్నూత రీతిలో నిరసనలు ఉవ్వెత్తున సాగాయి.విద్యార్థుల మద్దతుగా ప్రతి పక్షాలు అండగా నిలిచిన,వారికి మద్దతుగా పలికేందుకు వచ్చిన ప్రతి పక్షాల నేతలను పోలీ సులు అరెస్టు చేశారు.ప్రభుత్వం,అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపిన వైఫల్యం వల్ల రాష్ట్రం దిగివచ్చి విద్యార్థుల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అర్ధ రాత్రి వరకు జరిగిన వి ద్యార్థుల చర్చలు సఫలం అయ్యాయని,విద్యార్థుల డిమాండ్లను దశల వారిగా నెరవేర్చుతామని మంత్రి హామీ ఇచచారు.తక్షణం రూ.5 కోట్ల గ్రాంటు విడుదల నెల రోజుల్లో విసినీ నియమిస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు.దింతో వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలు విరమీసున్నట్లు ప్రకటించారు.చివరికి ట్రిపుల్ ఐటి విద్యార్థులు గెలిచారు.బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో తమ ఆందోళన విరమించారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామన్నారు.సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం విదితమే.చర్చల అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు విలేకరులతో మాట్లాడారు.ఒక్కొక్కటిగా తమ సమస్యలను పరిష్క రిస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో తాము ఆందోళనను విరమిస్తున్నామని తెలిపారు.వీసీ నియామకంతో సహా అన్ని సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి పేర్కొ న్నట్లు విద్యార్థులు వివరించారు.తక్షణమే రూ.5.6 కోట్ల నిధులను విడుదల చేస్తామని నిర్మల్‌ కలెక్టర్‌ పేర్కొన్నారు.రాత్రి 9.30గంటలకు మంత్రి రాక అంతకు ముందు సోమవారం రాత్రి 9.30 గం టల ప్రాంతంలో విద్యాలయ ఉపకులపతి రాహుల్‌ బొజ్జా,ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ వెంకటరమణ,డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌,విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ,స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి,కలె క్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ,ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాలయానికి వచ్చారు.తొలుత అధికారులతో చర్చించారు.అనంతరం 20 మంది ఎస్‌జీసీ (స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌ న్సిల్‌) విద్యార్థులతో ఆడిటోరియంలో చర్చలు ప్రారంభించారు.అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి.అంతకు ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థులు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయిం చారు.భోజన విరామం తరువాత జోరుగా వర్షం కురిసినప్పటికీ గొడుగులతో శాంతియుతంగా ఆందోళన కొనసాగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here