నిజామాబాద్:ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు,మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్,ప్రియాంక జాదవ్ దంపతులు.వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్ ను నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో బుధవారం ప్రవేశపత్రం నింపి జాయిన్ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతవిద్యావంతులలైన ఉపాధ్యాయుల కు కొదువలేదని,ఉన్నత రాజ్యాంగ వ్యవస్థ లో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలలో వారి సంతానాన్ని చేర్పించడం బడుగు,బలహీనవర్గాల వారికి ఉత్తేజాన్ని కలిగిస్తుందని,ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.