వర్షం కోసం గిరిజనులు ఏంచేశారంటే..?

విజయనగరం:మనదేశంలో ఎన్నో రకాల మతాలు,సిద్ధాంతాలు,ఆచారాలు ఉన్నాయి.గ్రామాల్లో ఆచారాలను ఎక్కువగా పాటిస్తుంటారు.గ్రామాల్లో పాటించే ఆచారాలు చాలా చిత్రంగా ఉంటాయి.వర్షాలు కురవాలని కోరుతూ చాలామంది పూజలు చేస్తుంటారు.కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు.గ్రామదేవతలకు కోళ్లు,మేకలు బలి ఇస్తుంటా రు.అయితే,విజయనగరం జిల్లాలోని సాలూరు మండలంలో ఉన్న కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు వర్షాల కోసం వినూత్నంగా పూజలు నిర్వహించారు.ఈ గ్రామానికి సమీపంలో జాకరమ్మ కొండ ఉన్నది.ఆ కొండపై కొండభైరవుడు,జాకరమ్మ అమ్మవార్లు ఉన్నారు.కూర్మరాజు గ్రామం నుంచి రైతులు కొండపైకి చేరుకొని పూ జలు నిర్వహించారు.అనంతరం తమ వెంట తెచ్చిన కోడి,మేకలను బలిఇచ్చి వాటిని వండారు.పాయసం చేసి అమ్మవార్లకు ప్రసాదాలను సమర్పించి అనంతరం అకు ల్లో ప్రసాదం తీసుకున్నారు.కొండపైకి చేరుకున్న రైతులు మోకాళ్లు,మోచేతులను కింద ఆన్చి నాలికతో ప్రసాదాన్ని నాకుతూ తిన్నారు.చేతులతో ముట్టుకోకుండా ప్ర సాదాన్ని ఇలా తీసుకున్నారు.ఇది వింతగా కనిపించినా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమని వర్షాలు కురవని సమయంలో ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని చెబు తున్నారు ఆ గిరిజన రైతులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here