దమ్ముంటే రా..రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాల్ విసిరిన మల్లారెడ్డి

హైదరాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం.మంత్రి మల్లారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని మూడు చింతలపల్లిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన దళిత,గిరిజ న ఆత్మగౌరవ దీక్ష సెగ అధికార పార్టీకి గట్టిగానే తగిలింది.తనను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై మల్లారెడ్డి చెలరేగిపోయారు.తొడగొట్టి రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు.నా మంత్రి,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తా పీసీసీ చీఫ్‌,ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తావా?ఎన్నికలకు వెళదాం నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటా దమ్ముంటే గెలిచి చూపించు”అని మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు.20 నెలలు ఆగు 15 నెలలు ఆగు అని చెప్పడం కాదు.ట్రైల ర్‌గా ఇప్పుడు గెలిచి చూపించు కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇవ్వు అని సవాల్ విసిరారు.ఎంపీ,ఎమ్మెల్యే రెండింటికి నిలబడదాం.ధైర్యం ఉంటే నా సవాల్‌ను స్వీకరించు అం టూ పదే పదే తొడగొడుతూ మల్లారెడ్డి ఊగిపోయారు.మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్ప ష్టం చేశారు.హైదరాబాద్‌లో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణ లను ఖండించారు.తాను ఎలాంటి తప్పు చేయలేదని ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని వెల్లడించారు.తనకు 600 ఎకరాల భూమి ఉందని అందులో అసైన్డ్‌ చెరువులకు సంబంధించినది కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు.అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు.అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్న ట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here