సేవల పేరుతో..ఆశ్రమంలో బాబా ఏమిచేశాడంటే..?

జైపూర్‌:ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది.స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై లైంగి క దాడికి పాల్పడ్డాడు.రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాబా బారి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చే యడంతో బాబా ఆకృత్యాలు బయటపడ్డాయి.రాజస్థాన్‌లోని జైపూర్‌లో బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన వైనం వెలుగు లోకి వచ్చింది.ఇందులో ముగ్గురు మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత కలకలం రేపింది.తపస్వి ఆశ్రమంలో సత్సంగంలో పాల్గొనేందుకు వెళ్లి న తమపై బాబా శైలేంద్ర మెహతా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితులు ఫిర్యాదు చేశారని భంక్రోటా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముకేశ్ చౌదరి పేర్కొన్నారు.చాలా ఏళ్లుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి తపస్వి ఆశ్రమానికి వెళ్తున్నట్టు బాధితులు వెల్లడించారు.సేవల పేరుతో ఆ మహిళలు రెండు రోజుల పాటు ఆశ్రమంలోనే ఉండేవారు. అదే సమయంలో నిందితుడు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here