డోంట్ కేర్..నేను చెప్పినట్టు చేయండి చాలు..లాక్డౌన్ వేస్ట్:కేసీఆర్

హైదరాబాద్:కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.రాష్ట్రంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.వందలాది మంది మృత్యువాతపడుతున్నారు.దీంతో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించాలంటూ చాలా మంది సలహాలు ఇస్తున్నారు.కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి కేసీఆర్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.రాష్ట్రంలో లాక్డౌన్ ఆలోచనే లేదు అలా చేస్తే గొంతు పిసికినట్లే అంటూ వ్యాఖ్యానించారు.పైగా ప్రజలు తాను చెప్పినట్టు నడు చుకుంటే ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని సలహా ఇచ్చారు.ప్రగతి భవన్‌లో కరోనా పరిస్థితులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌,ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ము ఖ్యమంత్రి మాట్లాడుతూ లాక్డౌన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.నిత్యావసరాల సరఫరా,పాలు,కూరగాయలు,పండ్లు,అత్యవసర వైద్య సేవలు,ప్రసవాలు,పారిశు ద్ధ్య కార్యక్రమాలను ఆపలేం.ఆక్సిజన్‌ సరఫరా అత్యంత కీలకం.లాక్డౌన్‌ విధిస్తే వీటన్నింటికీ ఆటంకాలేర్పడుతాయి.ఒక భయానక పరిస్థితి సృష్టించినట్లవుతుంది.అం దుకే లాక్డౌన్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదు అని స్పష్టం చేశారు.అయితే ఈ వైరస్ కట్టడి కోసం ప్రజలు తమ వంతుగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నా రు.ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు.ఇందుకోసం తాను చేసే సూచనలు పాటించాలని కోరారు.పెళ్లిళ్లలో వందకు మించి జమ కావొద్దు.పరి శుభ్రతను పాటించాలి.శానిటైజర్లు,మాస్కులను వాడాలి.భౌతిక దూరాన్ని మరవొద్దు.ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందొద్దు.ముందస్తుగా ప్రభుత్వం అందజేసే కొవిడ్‌ కిట్లను వినియోగించుకోవాలి.ఆ కిట్లను ఇంటింటికీ అందజేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here