టీచర్ కావాలనుకున్న..హీరోయిన్ అయ్యా:రష్మిక

హైదరాబాద్:సినిమా హీరోయిన్లు చాలావరకు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటారు.కానీ టాలీవుడ్ లో మంచి స్వింగ్ లో ఉన్న రష్మిక మాత్రం ఇందుకు భిన్నం.కొందరి విషయంలో అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది.అందుకు తన జీవితమే నిదర్శనం అంటోంది ఈ ముద్దుగుమ్మ.మైసూర్ లో కాలేజీలో చదువుకునేటప్పుడు టీచింగ్ వృత్తిలో సెటిల్ అవ్వాలనుకునే దానిని.ఎందుకో తెలియదు టీచింగ్ పై ఉన్న ఇష్టంతో డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ తో పాటు సైకాలజీ సబ్జెక్ట్ కూడా తీసుకున్నాను.అయితే భగవంతుడు నా కెరియర్ ని మరోలా రాసిపెట్టాడు.అనుకోకుండా డిగ్రీ చేసేటప్పుడు మోడలింగ్ లోకి ప్రవేశించాను తర్వాత ఇదిగో ఇలా సినిమాలలోకి వచ్చేశాను.అందుకే ఇదంతా చూస్తుంటే ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పింది రష్మిక.ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలోనూ,శర్వానంద్ కు జోడీగా’ఆడాళ్లూ మీకు జోహార్లు’చిత్రంలోనూ నటిస్తోంది.ఇక హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం’మిషన్ మజ్ను’ ‘గుడ్ బై’ చిత్రాలలో నటిస్తోంది.ఇదిలావుంచితే తొలిసారిగా రష్మిక తమిళంలో ‘సుల్తాన్’ సినిమాలో నటించింది.ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here