తెలంగాణలో 2 కార్పొరేషన్లు,5మున్సిపాలిటీలకు మోగిన నగారా..


హైదరాబాద్:తెలంగాణ‌లో మినీ పుర‌పో రుకు స‌ర్వం సిద్ధ‌మైంది.రెండు కార్పొరేషన్లు,ఐదు మున్సిపాలి టీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికే షన్‌ జారీ చేసింది.వ‌రంగ‌ల్,ఖ‌మ్మం కార్పొరేష‌న్లు,అచ్చంపేట‌,సిద్దిపేట‌,జ‌డ్చ‌ర్ల‌,కొత్తూరు,న‌కిరేక‌ల్ మున్సి పాలిటీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుం ది.మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.రేప‌ట్నుంచి ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.19న అభ్య‌ర్థుల నా మినేష‌న్ ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు.నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌ కు ఈ నెల 22 చివ‌రితేదీ.*ఖాళీ అయిన డివిజన్లకు ఎన్నికలు*వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు,గజ్వేల్‌,నల్గొండ,జల్‌పల్లి,అలంపూర్‌,బోధన్‌, పరకాల,మెట్‌పల్లి,బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నిక జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here