నేడు..ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

0
407

జమ్మికుంట:ఎంత డబ్బు ఉన్నా ఒంటికి సుఖం లేకపోతే ఎందుకు’అన్నది పెద్దల మాట.చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు.మరికొందరు ఆర్థిక ప రిస్థితులు,కుటుంబ సమస్యలు,తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో మానసిక సమస్యల బారిన పడుతున్నారు.ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నానుడు.ఆరోగ్యం బాగుంటే అంతా బా గుంటుంది.కాని నేడు మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు.అప్పటి కాలాన్ని అన్వయించుకుని నాటి పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పా రు.కానీ ఇప్పటి పరిస్థితులు వేరు.ఒకటే టెన్షన్‌ టెన్సన్‌ ఉరుకులపరుగల జీవితం.కనీసం కుటుంబ సభ్యులతో సైతం గపడలేని దయనీయత.ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం.ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా అక్టోబర్‌ 10న జరుపుకోవాలని ప్రకటించింది.శారీరక ఆరోగ్యం మరియు మేటి ఆరోగ్యానికి అం త‌ర్గ‌తంగా మానసిక ఆరోగ్యం ఎంతోగానో దోహ‌దం చేస్తుంద‌ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా అన్నారు.సమాజం వేగంగా పరిగెడుతోం ది.అందరి కంటే నేనే ముందుండాలి.రేపటిని ఈ రోజే చూడాలి.ప్రపంచాన్ని గెలవాలనే టార్గెట్‌తో అనేక మంది జీవితంలో నిరంతరం పరుగులు పెడుతున్నారు.ఆ వేగంలో పడి ఆరో గ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.అయిన వాళ్లను కూడా పట్టించుకోవడం లేదు.బంధాలను మరిచిపోతున్నారు.జీవితంలో వేగం ఉండాలే కాని వేగమే జీవితం కాకుడదు.బాధల్లో,కష్టాల్లో ఉ న్నప్పుడు మన వాళ్లు తోడుంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది.డబ్బు పోతే మళ్లీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది.కానీ బంధువులు,బాంధవ్యాలను తెంచుకుంటే తిరిగి రావు.అం దుకే వ్యసనాలకు,ఆందోళనకు స్వస్తి చెప్పి ప్రశాంతంగా నవ్వూతూ ఉంటే మానసిన ప్రశాంతత మీ సొంతం అవుతుంది.కష్టాలు,బాధలు,లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి.వాటిని గురించే ఆ లోచిస్తూ మనసు పాడు చేసుకుంటే మనకే నష్టం.మనసు బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటేందనే విషయాన్ని గుర్తించాలి.మానసిక ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయాన్ని మనసా,వాచా,కర్మణా నమ్మి ఆ దిశగా మహాభాగ్యాన్ని పొందాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here