చత్తీస్ గడ్/తూర్పు గోదావరి:మావోయిస్టులను ఏరివేయాలని పోలీసులు,పోలీసులకు షాక్ ఇవ్వాలని మావోయిస్టులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఉనికిని చాటుకోవడం కోసం వ్యూ హాలను రచిస్తున్నారు.ఇటీవల పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లతో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుండగా భద్రతా బలగాలను ఎదుర్కోవడం కోసం మావోయిస్టు లు సరికొత్త వ్యూహానికి తెర తీశారు.భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని బూబీ ట్రాప్ లను అమర్చారు మావోయిస్టులు.ఆంధ్రప్రదేశ్ చత్తీస్ గడ్ సరిహద్దులో ఉన్న తూర్పు గోదావరి జిల్లా మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ స్క్వాడ్,సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.అక్టోబర్ 8,2021 శుక్రవారం నాడు ఆంధ్ర ఛత్తీస్‌గఢ్ స రిహద్దు కూంబింగ్ కార్యకలాపాలలో నిమగ్నమైన పోలీసు బలగాలకు కనిపించిన బూబీ ట్రాప్ లు మావోల ప్లాన్ ను కళ్ళకు కట్టాయి.మొత్తం తనిఖీలలో పోలీసులు 10 బూబీ ట్రాప్‌ల ను కనుగొన్నారు.చింతూరు ఏఎస్పి జి కృష్ణకాంత్ మరియు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ యువకుమార్ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులో అడవిలో తవ్విన బూబీ ట్రాప్ లను కనుగొన్నారు.పోలీసులను చంపేందుకే మావోయిస్ట్ ల బూబీ ట్రాప్స్ భూమిని లోపల పది అడుగుల లోతు వరకు తవ్వి,దానిలో వెదురు బొంగులను బాణాల మా దిరిగా చెక్కి భూమిలోపలికి గుచ్చి సూది మొనల్లాంటి ఇనుప భాగాలు పైకి ఉండేలా అమర్చి,వాటి పైభాగాన ఆకులూ,అలమలతో కప్పి బూబీ ట్రాప్ లను తయారు చేసినట్టు గుర్తించా రు.తూర్పు గోదావరి జిల్లాలోని సరిహద్దు గ్రామం మల్లంపేటలో 10 బూబీ ట్రాప్ లను కనుగొన్న క్రమంలో మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు మావోయిస్టు మిలీ షియా,దండకారణ్య అడవుల దళ సభ్యులు వేసిన బూబీ ట్రాప్స్ పోలీసులను గాయపరిచి చంపడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు.బూబీ ట్రాప్ లను గుర్తించే పరికరాలు లేవన్న పోలీ సులు ఆకులు మరియు మట్టితో కప్పబడిన బూబీ ట్రాప్‌ల పరిమాణం మరియు పదును దృష్ట్యా,పోలీసు బలగాలు అడవులలో వారి కూంబింగ్ ఆపరేషన్‌ల సమయంలో వాటిలో పడితే తీవ్ర గాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.కొన్ని సందర్భాలలో చనిపోయే ప్రమాదం కూడా ఉందని వెల్లడించారు.పోలీసుల వద్ద ఉన్న పరికరాలతో ల్యాండ్ మైన్‌లను గుర్తించవచ్చని కానీ బూబీ ట్రాప్‌లను గుర్తించలేమని ఇచ్చారు.సరిహద్దు ప్రాంతంలో మోహరించిన భద్రతా దళాలలో భయాందోళనలు సృష్టించడానికి మావోయిస్టులు కొత్త వ్యూహాన్ని రచించినట్లు,ఇక వారి ప్లాన్ ను పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ తెలిపారు. చత్తీస్ గడ్ సరిహద్దులో 100 బూబీ ట్రాప్ లను తొలగించిన తెలంగాణా పోలీసులు ఇటీవల తెలంగాణ పోలీసులు చత్తీస్‌గఢ్ సరిహద్దులో 100 బూబీ ట్రాప్‌లను కనుగొని వాటిని తొల గించారు.ఉచ్చులు సాధారణంగా గుంతల్లో ఏర్పాటు చేస్తారు.ఇందులో పదునైన ఐరన్ రాడ్స్ గుచ్చుకునేలా ఏర్పాట్లు,లేదా పేలుడు పదార్థాలను ఉంచుతారు.మావోయిస్టు గ్రూపులో మి లిటెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుండడంతో,గెరిల్లా మిలిటెంట్లు భద్రతా దళాలపై విధ్వంసం సృష్టించడానికి ముఖ్యంగా బూబీ ట్రాప్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.పొరపాటున ట్రాప్ లో పడితే పేలుడు సంభవిస్తుంది లేదా పదునైన ఇనుప బాణాలు శరీరంలో గుచ్చుకుని చనిపోయే ప్రమాదం ఉంటుంది.కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులు,భద్రతా బలగాలు 10 బూబీ ట్రా ప్ లను గుర్తించగా,ఆంధ్ర చత్తీస్ ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇంకా మరెన్ని బూబీ ట్రాప్ లు ఉన్నాయో అన్నది తెలియాల్సి ఉంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...