ఏపీ,తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్,తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు బదిలీ అయ్యారు.తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ,ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మి శ్రాను నియమించారు.రాష్ట్రపతితో పాటు సీజేఐతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకున్నామని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ట్విట్టర్‌లో ప్రకటించారు.ఏపీ,తెలంగాణతో పాటు మరో ఆరు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించారు.20 రోజుల కిందటే చీఫ్ జస్టిస్‌ల బదిలీ,నియామకాల గురించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.అప్పట్నుం చి పరిశీలనలో ఉంచిన కేంద్రం ఇప్పడు ఆమోద ముద్ర వేసింది.ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఉన్నారు.గత జనవరిలోనే ఆయన ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు.బదిలీపై చత్తీస్‌ఘడ్ వెళ్తున్నారు.ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వచ్చిన హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లా రు.జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లినందున యాక్టింగ్ సీజేగా జస్టిస్ రామచంద్రరావు వ్యవహరిస్తున్నారు.ఆయనను కూడా బదిలీ చేశారు.ప్రస్తుతం దేశంలో ఎనిమి ది హైకోర్టులకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌లు ఉన్నారు.అన్ని హైకోర్టులకు పూర్తి స్థాయి సీజేలను సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది.ఈ సిఫార్సులన్నింటికీ కేంద్రం ఆమోద ముద్ర వేసిం ది.ఏపీ హైకోర్టు సీజేగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రస్తుతం చత్తీస్‌ఘడ్ సీజేగా ఉన్నారు.ఆయనను ఏపీ బదిలీ చేశారు.ఏపీ సీజే చత్తీస్‌ఘడ్‌కు బదిలీ చేశారు.సు ప్రీంకోర్టు కొలిజీయం ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి వీలైనంతగా మానవ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.శరవేగంగా న్యాయమూర్తులను ని యమిస్తున్నారు.కేంద్రం విడతల వారీగా నియామకాలకు ఆమోద ముద్ర వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here