వరంగల్:ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు.అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల మూడు బంగారు పుస్తేల త్రాడులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు,రెండు సెల్‌ఫోన్లను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో మొదటి నిందితుడు పుల్లూరి రాజేష్,వయస్సు 32,నివాసం ధర్మారం గ్రామం,జమ్మికుంట మండ లం,కరీంనగర్ జిల్లా కాగా మరో నిందితుడు బత్తులరాజు,వయస్సు 32,గోల్లగూడెం గ్రామం, సైదాపూర్ మండలం,కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తిం చారు.ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీస్ అరెస్టు చేసిన నిందితులు ఇద్దరు ఒకే కళాశాలో డిగ్రీ కల్సి చదవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహం కుదరటంతో పాటు నిందితులిద్దరు యం.బి.ఏ చదువుకోని నిందితుల్లో ఒకరైన పుల్లూరి రాజేష్ పాన్‌షాపు నిర్వహిస్తుండగా, మరోనిందితుడు బత్తుల రాజు మెడికల్ రిప్రజెంటివ్ పనిచేస్తువుండేవారు.నిందితులు చోరీ చేసే ముందు ముందుగా తమ స్వగ్రామల నుండి తమ ద్విచక్రవాహనాలపై ముందుగా నిందుతులో ఒకరి ద్విచక్రవాహనాన్ని తమ అనుకూలమైన ప్రాంతంలో పార్కింగ్ చేసి మరో ద్విచక్ర వాహనంపై చైన్ స్నాచింగ్ చేసేందుకు బయలుదేరివే ళ్ళేవారు.ఈ క్రమంలో నిందితులు తమ వాహనం వెనుకవైపు వాహనం నంబర్ కనపడకుండా నల్లరంగు ప్లాస్టర్ తో మూసి వేసేవారు.చోరీ అనంతరం నిందితులద్దరు తమ వాహనాల్లో తిరిగి తమ ఇళ్లకు చేరుకోనేవారు.ఈ చోరీలపై సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా సూచనల మేరకు కాజీపేట ఎ.సి.పి రవీంద్ర కుమార్ అధ్వర్యంలో ధర్మసా గర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్,వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు నిర్వహించగా,ప్రస్తుతం పోలీసులు తమ అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిం దితులను గుర్తించడంతో పాటు వారి కదలికలపై నిఘా పెట్టారు.మడికొండకు వస్తుండగా ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ అదేశాల మేరకు వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు,ప్రొబేష నరీ ఎస్.ఐ హఫీజా తమ సిబ్బందితో కల్సి వేలేరు పీచర క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహన తనీ ఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానస్పదం పోలీసులను నిందితులను వెంబడించి పట్టుకొని తనీఖీ చేయగా నింది తుల వద్ద మూడు బంగారు పుస్తేల త్రాడ్లను గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన చైన్ స్నాచింగ్ చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించారు.చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన కాజీపేట ఎ.సి.పి రవీందర్ కుమార్,ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ రమేష్,వేలేరు ఎస్.ఐ వెంక టేశ్వర్లు,ప్రొబేషనరీ ఎస్.ఐ హఫీజా,ఎ.ఎస్.ఐ ఉమాకాంత్,కానిస్టేబుల్లు రమేష్ బాబు,ఆహ్మద్,హసనపర్తికానిస్టేబుల్ క్రాంతికుమార్,రమేష్ లను పోలీస్ కమిషనర్ అభి నందించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...