నాయకుల గైర్హాజరుతో..జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం వాయిదా..

కరీంనగర్:జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సభ్యులు హాజరు కానందున వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.ఆది వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయము 11 గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుటకు హాజరు కాగా 11:30 గంటల వరకు వేచి చూసిన కూడా సభ్యులు సమావేశానికి హాజరు కానందున జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల విజయ తె లిపారు.జిల్లా మంత్రివర్యుల అనుకూలమైన సమయం తీసుకొని తిరిగి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని చైర్పర్సన్ తెలిపారు.ఈ సర్వసభ్య స మావేశానికి సమావేశానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక,జిల్లా అధికారులు తదితరులు హాజరు అయినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here