ఈ-రూపీ అంటే ఏమిటి..దీనిని ఎలా ఉపయోగించాలి?

న్యూఢిల్లీ:నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ-రూపీ అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది.ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ప్రధాని మోదీ ఈ యాప్ ను ప్రారంభించనున్నారు.ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్‌ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్‌లెస్‌,కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా రూపొందించారు.ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎమ్మెస్‌ స్ట్రింగ్‌ వోచర్‌ల ద్వారా లబ్ధిదారు డి మొబైల్‌ ఫోన్‌కి పంపిస్తారు.ప్రస్తుతం డిజిటల్ ప్రెమెంట్స్ యాప్స్ ద్వారా చేస్తున్న విధంగానే ఉంటుంది.కానీ ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అ వసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.ఈ వోచర్లు ఈ-గిఫ్ట్ కార్డులు వంటివి ఇవి ప్రీపెయిడ్ స్వభావం కలిగి ఉంటాయి.ఉదాహరణకు మెడిసిన్ కొనేందుకు ఈ-రూపీ వోచర్లు తీసుకుంటే ఆ వోచర్లను మెడిసిన్ కొనేందుకే వాడాలి.ప్రెమేట్లు మొత్తం వోచర్ల ద్వారానే జరుగుతాయి. మనం చెల్లించాల్సిన వారికి వోచర్ ఎస్ఎంఎస్ చేయడం లేదంటే స్కాన్ చేయడం వంటివి చేయాలి.స్మార్ట్ ఫోన్ లేనివారు వోచర్ కోడ్ ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.ఈ-ఆర్ యుపీఐ వోచర్లు అనేవి నిర్ధిష్టమైన వాటి కోసం మాత్రమే ఉద్దేశించబడినవి.బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు.అదే ఇందులోని ప్రధాన తేడా.ఈ వోచర్లు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి.వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు.సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది.నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం,ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యుపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,హెచ్‌డీఎఫ్‌సీ,యాక్సిస్,పంజాబ్ నేషనల్ బ్యాంక్,బ్యాంక్ ఆఫ్ బరోడా,కెనరా బ్యాంక్, ఇండస్ సిండ్ బ్యాంక్,ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,ఆర్థిక మంత్రిత్వ శాఖ,ఆరోగ్య మంత్రిత్వశాఖ,నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here