వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్యం:డాక్టర్ కావ్య

హన్మకొండ:జీవిత చరమాంకంలో సౌకర్యాలలేమితో ఇబ్బందులపాలవుతున్న వృద్ధులకు అండగా ఉంటున్న వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్య మని ఫౌండేషన్ ఛెయిర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హనుమకొండలోని లార్డ్స్ ఎన్జీవో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని ఇన్ మేట్స్ కు కడియం ఫౌండేషన్ పక్షాన ఆదివారం స్వెటర్ల పంపిణీ చేసారు.వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు,వయసు మళ్లిన వాళ్ల బాగోగులను చూసుకోవడం కోసం నిర్వహించే వృద్ధాశ్రమాలు నిరంతరం వాళ్లను కంటికి రెప్పలా కాపాడుతుంటా యని అలా సేవాభావాన్ని ఆచరణ రూపంలో పెట్టడంద్వారా సమాజంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయని డాక్టర్ కావ్య కొనియాడారు.శీతాకాలంలో వృద్ధులు వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలుగా తమ సంస్థ పక్షాన డాక్టర్ కావ్య స్వెటర్ల పంపిణీ చేసారు.సమాజంలో అణగారిన వర్గాలు,దివ్యాంగులు,వృద్ధులతో బాటు పేదరికం లో మగ్గుతున్న మహిళలు,బా లికల కోసం తమ కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా డాక్టర్ కావ్య వివరించారు.కార్యక్రమంలో కడియం ఫౌండేషన్ డైరెక్టర్ కడియం రమ్య,మాజీ కార్పోరేటర్ కేసిరెడ్డి మాధవి,అస్నాల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here