ఫాంహౌస్..సీఎంను బయటికి రప్పించాం:బండి సంజయ్

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ధ్వజమెత్తారు.ఇటీవల కాలంలో బీజేపీ చాలా అంశాల్లో విజయం సాధించిందని అన్నారు.ఫాంహౌస్ లో కాలం గ డిపే ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ కు రప్పించామని తెలిపారు.గతంలో ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ ను ఇప్పుడదే ధర్నా చౌక్ లో కూర్చుని దీక్ష చేపట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.అ యితే కేసీఆర్ దీక్ష చేసింది రైతుల కోసం కాదని,రైస్ మిల్లర్ల కోసమేనని బండి సంజయ్ విమర్శించారు.కేసీఆర్ దీక్షకు,ప్రధాని మోదీ రైతు చట్టాలు రద్దు చేయడానికి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు.ఇక్కడ నువ్వు దీక్ష చేసింది ధాన్యం కొనుగోలు గురించి అక్కడ మోదీ రద్దు చేసింది రైతు చట్టాలను.ఇక్కడ నువ్వు తిడితే మోదీ అక్కడ రద్దు చేశారా? ఇంతకీ నువ్వు దీక్ష చేసింది పంజాబ్ రైతుల కోసమా,తెలంగాణ రైతుల కోసమా?అని నిలదీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here