టీ20 ప్రపంచకప్..హైలైట్స్..!

  • టీ20 ప్రపంచకప్..పలు రికార్డులు బద్దలు..మూడు ఫైనల్స్‌లలో కివీస్‌ను చిత్తు చేసిన ఆసీస్..ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్..ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్‌గా కేన్ న్యూఢిల్లీ:ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిన్నటితో ముగిసింది.ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచ కప్‌ను సాధించి విజయ గర్వంతో స్వదేశంలో అడుగుపెట్టబోతోంది.ఆ ద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టోర్నోలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.గత ప్రపంచకప్‌లు,తాజా టోర్నీలో నమోదైన రికార్డులను ఓసారి చూద్దామా..ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 1987, 1999,2003,2007,2015 వన్డే ప్రపంచకప్‌లను గెలుచుకుంది.2006,2009 చాంపియన్స్ ట్రోఫీలలో విజేతగా అవతరిం చింది.తాజాగా టీ20 ప్రపంచకప్‌ను కూడా తన ఖాతాలో వేసుకుం ది.2015,2009,2021లో ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది.మూడింటిలోనూ మార్టిన్ గప్టిల్ సభ్యుడిగా ఉన్నాడు.టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న వారు ఇర్ఫాన్ పఠాన్ (3/16)షాహిద్ అఫ్రిది (54& 1/20)క్రెయిగ్ కీస్‌వెట్టర్ (63)మార్లోన్ శామ్యూల్స్ (78 & 1/15)కుమార్ సంగక్కర (52)మార్లోన్ శామ్యూల్స్ (85) మిచె ల్ మార్ష్ (77)టీ20 ప్రపంచకప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్..షాహిద్ అఫ్రిది (2007)తిలక రత్నే దిల్షాన్ (2009)కెవిన్ పీటర్సన్ (2010)షేన్ వాట్సన్ (2012)విరాట్ కోహ్లీ (2014) విరాట్ కోహ్లీ(2016)డేవిడ్ వార్నర్ (2021)*2010 తర్వాత విజేత జట్టు నుంచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న రెండో ఆటగాడు వార్నర్.అప్పట్లో కెవిన్ పీటర్సన్ అందుకు న్నాడు.ఈ టోర్నీలో నమోదైన రికార్డులు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ రికార్డు.ఈ టోర్నీలో బట్లర్ అజేయంగా 101 పరుగులు చేశాడు. 303 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక ప రుగులు సాధించిన ఆటగాడిగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.16 వికెట్లతో టో ర్నోలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా వనిందు హసరంగ (శ్రీలంక). 19 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఓ ఇ న్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఆడం జంపా(ఆస్ట్రేలియా)ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్.ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్ల నష్టా నికి 210 పరుగులు చేసింది.ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు జట్ల కలిసి చేసిన పరుగులు 368.ఈ టోర్నీలో ఇదే అత్యధికం.13 సిక్స ర్లతో టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా బట్లర్‌.32 ఫోర్లతో టోర్నీలో అత్యధిక బౌండరీలు సాధించిన ఆట గాడిగా వార్నర్ ఆరు మ్యాచుల్లో నెగ్గి ఈ టోర్నీలో అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా ఆడిన ఆరింటిలోనూ ఓడి అత్యధిక మ్యాచుల్లో ఓడిన జట్టుగా బంగ్లాదేశ్‌ దుబాయ్‌ స్టేడి యంలో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 12 సార్లు చేజింగ్ చేసిన జట్టే విజయం సాధిం చింది.టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫైనల్‌ లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా న్యూజిలాండ్.గత రాత్రి జరిగిన ఫైనల్‌ లో 172 పరుగులు సాధించింది.ప్రపంచకప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్‌గా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.గత రాత్రి జరిగిన ఫైనల్‌లో 48 బంతుల్లో 10 ఫోర్లు,3 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here