వరంగల్:సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) కనుమూశారు.అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.సూపర్ స్టార్ కృష్ణ 1942 మే 31 గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు.కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి.1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు.అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం నాలుగు దశాబ్దాలకుపైగా సాగింది.సినీ కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు.1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తెరకెక్కించారు.1983లో ప్రభుత్వ సహకారంతో సొంతంగా పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు.దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు.
