🔹ముగ్గురి మృతి ఆరుగురికి గాయాలు 🔹ఆగివున్న లారీని ఢీకొన్న ఇన్నోవా వాహనం
🔹వర్ధన్న పేట పట్టణ శివారులోని డీసీ తండా వద్ద ఘటన.
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు సహా కుమారుడు మృతి చెందగా మరో ఆరుగురు గాయప డ్డారు.వరంగల్ ఖమ్మం హైవే పై వర్ధన్న పేట పట్టణ శివారు డీసీ తండా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.విషయం తెలు సుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతులు కృష్ణారెడ్డి,వర లక్ష్మి,వెంకటసాయి రెడ్డి గా గుర్తించారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోసం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఏపీలోని ఒంగోలు నుంచి వరంగల్ పెరుక వాడకు వస్తున్న క్రమంలో ఈ దు ర్ఘటన చోటుచేసుకుంది.కారులో మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు లేక పొగమంచు కారణమై ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ మే రకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.
