షర్మిల పార్టీ పేరు..వైఎస్సార్ తెలంగాణ పార్టీ

హైదరాబాద్‌:వైఎస్ఆర్ కుమార్తె వైఎస్.షర్మిల కొత్త పార్టీని పెట్టారు.తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు.ఈ మేరకు గురువారం జరిగిన ఆవిర్భావ సభలో ప్రకటించారు.హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆమె ప్రసంగించారు.తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లోకి రంగ ప్ర వేశం చేసిన దివంగత రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు.వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకుని హైదరా బాద్‌ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా పార్టీ జెండాను ఆవిష్క రించారు.అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని వైఎస్ షర్మిల అన్నారు.వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని ఆవిష్కరించిన ఆమె సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు.శత్రువులతోనూ ప్రశంసలు పొందిన నేత రాజశేఖర్ రెడ్డి అని ఆమె వ్యాఖ్యానించా రు.వైఎస్ జయంతి సందర్భంగా తెలంగాణలో పార్టీ పెట్టామని తెలిపారు.వైఎస్ ఆశయాల కోసం పోరాడ తానని షర్మిల పేర్కొన్నారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీ,వివిధ విధానాలు,అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయని చెప్పారు.సంక్షేమం,స్వయంసంవృ ద్ధి,సమానత్వం వంటి అంశాలే ముఖ్య అజెండా అని షర్మిల చె ప్పారు.పేదబిడ్డలకు ఉన్నత చదువులు,కార్పొరేట్ ఆరోగ్యం,108 ఇలా పేదవారి సంక్షేమానికి వైఎస్ఆ ర్ పెద్దపీట వేశారన్నారు వైఎస్ షర్మిల.మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు,11 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారని చెప్పారు.పక్క ఇల్లు,భూమి లేని పేదవానికి భూములు,మహిళలకు రుణాలు ఇచ్చి పేదరికాన్ని రూపుమా పారన్నారు.సంక్షేమ పాలనే వైఎస్ ను ప్రజల గుండెల్లో నిలిచేలా చేసిందన్నారు.వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేసి పేద రికాన్ని రూపు మాపడమే తమ సి ద్ధాంతమన్నారు వైఎస్ షర్మిల అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here