ఉత్సవాల్లో పూనకాలు నిజంగా వస్తాయా..?

వరంగల్:తెలుగు రాష్ట్రాలలో జాతరలు నిర్వహించే ఆనవాయితీ ఎక్కువగానే ఉంది.చాలా చోట్ల గ్రామదేవతలకు,అమ్మోరులకు జాతర నిర్వహిస్తూ ఉంటారు.అయితే, మీరెప్పుడైనా గమనించారా..? ఈ ఉత్సవాలలో కొందరు మహిళలకు పూనకాలు వస్తూ ఉంటాయి.వారిని కొంతమంది పట్టుకుని వేపాకులు విసురుతూ శాంతింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఇది నిజమేనా..? ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకుందాం.ఇటీవల ఫేస్ బుక్,వాట్సాప్ వంటి సోషల్ మీడియాలలో ఓ వీడి యో వైరల్ అయింది.ఆ వీడియో లో ఒక మహిళా ఒక పురుషుడు డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారు.ఆ మహిళా అమ్మవారి పాత్రను పోషిస్తుండగా పురుషుడేమో రా క్షసుడి పాత్రను పోషిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు.ఆ మహిళా బాగా ఇన్వాల్వ్ అయిపోయి డాన్స్ చేస్తూ చివరలో త్రిసూలం తో సదరు వ్యక్తిని గట్టిగా పొడవబోయిం ది.స్టేజి పై పక్కన వీడియో తీస్తున్న వ్యక్తులు ఆమెను పట్టుకుని వెనక్కి లాగి శాంతింప చేసారు.మనం ఏదైనా పని చేస్తున్నపుడు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పు డు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్న సంగతి మనకి తెలిసిందే.మనం శ్రద్ధ పెడితే,సాధించలేనిది ఏది ఉండదు.అలాగే సినిమాలు చూస్తున్నపుడు కూడా మనం బాగా ఇ న్వాల్వ్ అయిపోతే సినిమాలో ఎమోషనల్ సీన్లకు మనకు కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి.నిజానికి మనకి బాధ లేకపోయినా మనకు కన్నీళ్లు వస్తాయి.పై రెండు ఉదా హరణాలలోను మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పని లో ఇన్వాల్వ్ అవడం వలన మనం ఊహించనిది జరుగుతూ ఉంటుంది.అలాగే దేవి ఉత్సవాల స మయం లో కూడా ఆ దేవిని నిరంతరం ఉపాసించే వారు అమ్మవారిని ధ్యానిస్తూ తాదాత్మ్యత చెందుతారు.ఈ క్రమం లోనే వారి శరీరం లో జనించే ఉష్ణం వలన పూన కాలు వస్తూ ఉంటాయి.అమ్మవారు వచ్చారని అందరు పూజలు చేసి వారిని శాంతింప చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here