పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి.. వరుడు ఎవరంటే?

హైదరాబాద్:తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం,మలయాళం ఇండస్ట్రీలలో కూడా సాయి పల్లవి కి మంచి క్రేజ్ ఉంది.ఇప్పటివరకు సాయిపల్లవి నటించిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాలు కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.మరి ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ కి ఎం తోమంది అభిమానులు ఉన్నారు.ఇక తెలుగులో ఫిదా,మిడిల్ క్లాస్ అబ్బాయి,శ్యామ్ సింగరాయ్,లవ్ స్టోరీ,పడి పడి లేచే మనసు లాంటి సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.అదేమిటంటే సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందా? అంటే టాలీవుడ్ సినీ వర్గాల్లో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ,శ్యామ్ సింగరాయ్ లాంటి ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.అయి తే ఈ సినిమాలు విడుదలైన తర్వాత సాయి పల్లవి మరి కొత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు.హీరో రానాతో కలిసి నటించిన విరాటపర్వం సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు.అయితే కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా,అలాగే ఎలాంటి సినిమా వేడుకల్లో ఆమె కనిపించకపోవడంతో సాయి పల్లవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అందువల్లే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై సాయిపల్లవి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here