పీకే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా…!

పాట్నా:ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా…!ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.పీకే కొత్త రాజకీయ పార్టీ లేదా రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.సోమవారం (మే 2) ట్విట్టర్ వేదికగా పీకే రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ మేరకు పీకే ఇప్ప టికే కసరత్తు పూర్తి చేశారని చెబుతున్నారు.సొంత రాష్ట్రం బిహార్ నుంచే కొత్త రాజకీయ పార్టీ లేదా రాజకీయ వేదికపై పీకే ప్రకటన చేయనున్నారు.ఇందుకోసం ఆదివారమే ఆయన పాట్నాకు చేరు కున్నారు.పీకే రాజకీయ పార్టీ ప్రకటన జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.నిన్న,మొన్నటివరకూ కాంగ్రెస్ వైపు చూసిన పీకే ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని మార్చేసుకున్నారు.కాంగ్రెస్‌లో చేరట్లేదని స్పష్టతనచ్చిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన మార్క్ కోసం సొంతంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.నిజానికి కాంగ్రెస్‌లో పీకే చేరిక దాదాపుగా ఖాయమని అంతా భావించా రు.పార్టీలో పీకే చేరుతున్నారన్న జోష్ కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కనిపించింది.పీకే సలహాలు,సూచనలకు అధిష్ఠానం ఓకె చెప్పినట్లు ప్రచారం జరిగింది.సోనియాతో వరుస భేటీలు పీకేకి కాంగ్రెస్ ఇస్తు న్న ప్రాధాన్యం వెరసి పార్టీలో పీకే బిగ్ రోల్ ప్లే చేయబోతున్నట్లు విశ్లేషణలు వినిపించాయి.కానీ ఇంతలోనే పీకే కాంగ్రెస్‌కి ఝలక్ ఇచ్చారు.కాంగ్రెస్‌లో చేరకపోవడంపై స్పష్టమైన కారణాలేవీ బయట కు వెల్లడికానప్పటికీ ఇరువురి మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదన్న వాదనలు వినిపించాయి.ఓవైపు కాంగ్రెస్‌లో చేరికపై సంప్రదింపులు నడుస్తుండగానే హైదరాబాద్‌లో కేసీఆర్ తో పీకే భేటీ అవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే.కేసీఆర్ కారణంగానే పీకే కాంగ్రెస్‌లో చేరే ఆలోచన విరమించుకున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.ఏదేమైనా ఇప్పటి వరకూ ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో పరోక్ష పాత్ర పోషించిన పీకే ఇప్పుడు సొంత రాజకీయ నిర్మాణం కోసం అడుగులు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here