కరీంనగర్:మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి.దీని వలన చాలా ప్రయోజనాలు వున్నాయి.అయితే కరోనా మహమ్మారి సమయం లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ ని ఇచ్చింది.అయితే కొందరు రేషన్ కార్డులకు అనర్హులైనా ఉచిత రేషన్‌తో లబ్ధి పొందారని ప్రభుత్వం కి తెలిసింది.అందుకనే అనర్హులైన వారు రే షన్ కార్డులను ప్రభుత్వం సరెండర్ చెయ్యాలని అంది.ఒకవేళ అనర్హులైన కార్డుల యజమానులు తమ రేషన్ కార్డులను సరెండర్ చేయకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వా ర్నింగ్ ఇచ్చింది.ఇక మరి పూర్తి వివరాలను చూస్తే రూ.10 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగా పరిగణిస్తారు.అయితే వారికి మాత్రమే రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుంది.మరి ఇక ఎవరెవరు రేషన్ కార్డు సరెండర్ చేసేయాలి అన్నది చూస్తే 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిడివి వున్నా ఇల్లు లేదా ఫ్లాట్,కారు లేదా ట్రాక్ టర్,గ్రామం లోరూ.2 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం,నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉంటే కార్డు ఇచ్చేయాలి.తహసీల్దార్‌కు గానీ,డీఎస్‌వో ఆఫీసు లో కానీ రేషన్ కార్డు సరెండర్ చెయ్యాలి.ఇక ఎల్లో రేషన్ కార్డుకి అయితే వార్షికాదాయం రూ.15 వేల వరకు గల కుటుంబాలు అర్హులు.కుటుంబంలో డాక్టర్,న్యాయవాది,ఆర్కిటెక్,చార్టర్డ్ అకౌంటెంట్ వుండకూడదు.ప్రొఫె షనల్ టాక్స్/ సేల్స్ టాక్స్/ఇన్‌కం టాక్స్ చెల్లింపుదారులు కుటుంబంలో వుండకూడదు.అలానే రెసిడెన్షియల్‌లో ఫోన్ ఫెసిలిటీ లేని కుటుంబాలు అర్హులు.కారు వుండకూడదు.ఇంట్లో సభ్యులందరికీ కలిపి రెండు హెక్టార్ల మెట్ట,హెక్టార్ మాగాణి,కరువు ప్రాంతాల్లో అర్ధ హెక్టార్ భూమి కూడా లేని వారు అయ్యి ఉండాలి.కాషాయ కార్డు కి అయితే టాక్సీ మినహా కార్లు లేని కుటుంబాలు మాత్రమే అర్హు లు.నాలుగు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉండాలి.రూ.15 వేల నుంచి రూ.లక్ష లోపు వార్షిక ఆదాయం గల కుటుంబాలు దీనికి అర్హులు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...