సిద్దిపేట:సిద్దిపేట జిల్లాల్లోని జక్కాపూర్ గ్రామంలో ఇటీవల ఆకాలవర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ సందర్శించి రైతులతో మాట్లాడుతుం డగా ఊహించని విధంగా అక్కడికి ఓ ఆగంతకుడు చేరుకొని కె ఏ పాల్ చెంప చెల్లుమనిపించాడు.పాల్ పర్యటనలో బంధోబస్తు నిమిత్తం డిఎస్పీ చేస్తున్న పర్యవేక్షణలో స్వయానా డిఎస్పీ ముందే దా డి జరగడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.జరిగిన సంఘటనపై పాల్ మాట్లాడుతూ తనపై గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై హత్య ప్రయత్నం చేయిం చాడని అదేతరహలో నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై టిఆర్ఎస్ కార్యకర్తలతో దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు.కాగా తనకు దేవుడి అనుగ్రహం వుందని,తనపై దాడి చేసిన వారికి త ప్పకుండా దేవుడి శిక్ష వేస్తాడని అన్నారు.