పీకే..తనకు తానే బలవుతున్నాడా?

హైదరాబాద్:తన మాయలో తనే పడ్డాడా? ఇన్ని విజయాల,పరిణామాల నిషాలో తనే ఎందుకు రాజకీయనాయకుడు కాకూడాదు అనే ఆలోచన రావడం సహజం.ఇతర పార్టీలలో తనుకోరిన జాగా దొరకనపుడు తనే పార్టీ పెట్టాలనే కోరిక రావడం కూడా సహజమే.ఇలా తనది కాని రాజకీయ రంగంలోకి ప్రశాంత్ కిశోర్ వస్తున్నారు.రాజకీయ నేపథ్యమో,ఉద్యమాల నేపథ్యమో లేకుండా రాజకీయ పార్టీ పెట్టి విజయవంతమయిన సంఘటనలు 1981 తర్వాత దేశం లేవు.కెసిఆర్ రాజకీయ ఉద్యమం,సుదీర్ఘ రాజకీయాను భవంతో వచ్చారు.జగన్ కు ఉన్న పొలిటికల్ క్యాపిటల్ చాలా శక్తివంత మయింది.కేజ్రీవాల్ కూడా అవినీతి వ్యతిరేక ఉద్యమంతోనే వచ్చారు.జెఎంఎం కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతోనే వచ్చింది.అలా కాకుండా,రాజకీయ నేపథ్యంలో లేకుండా తన వ్యాపారంలో హీరో అ యి,రాజకీయాల్లోకి వచ్చి,పార్టీ పెట్టి హీరోలయిన వాళ్లు తక్కువ.ఎన్నికల్లో జీరోలయి వాళ్లు మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్న ఉదాహరణలున్నాయి.అందువల్ల బీహార్ లో సొంతంగా పార్టీ పెట్టి స్వతంత్రంగా నిలదొక్కుకునే అవకాశాలు ప్రశాంత్ కిశోర్ కు బాగా తక్కువ.అయితే,ఏదో ఒక కూటమి కూడగట్టి అందులో చేరితే ప్రయోజనం ఉండవచ్చు.జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రయత్నం ఫలించలేదు. బీహార్ లో సాధ్యమా? ఏమవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here