ఆరోగ్యం ఆహ్లాదం కోసం సైకిల్ పై ప్రయాణించండి:సీపీ తరుణ్ జోషి


వరంగల్:రోజువారీ వ్యాయాయం కోసం సైక్లింగ్ చేయటం అంటే ఖరీదైన సైకిల్ వాడాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.ఏదైనా సామాన్యమైన సైకిల్ ని కూడా ఉపయోగిచవ చ్చని వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి అన్నారు.బుధవారం న్యూ సైన్స్ పీజీ కాలేజీ నందు సెమినార్ హాల్ లో నిర్వహించిన ట్రిసిటీ రైడర్స్ వరంగల్ సెప్టెంబర్ సైక్లింగ్ ఛాలెంజ్ లో భాగంగా,తరుణ్ పాల్గొని ఛాలెంజ్ లో గెలుపొందిన వారికి మెడల్స్,మెమెంటోస్ మరియు సర్టిఫికెట్స్ ప్రదానం చేసారు.ఈ సమావేశం లో మాట్లాడుతూ,వరంగల్ నగరం సైక్లింగ్ ని ప్రమోట్ చేయటంలో ముందుండాలని అన్నారు.నగరం లో 4-5 కిలో మీటర్ల దూరం లో ఉండే మార్కెట్,కిరాణం,మందుల షాపులకు సైకిల్ వాడటం వాళ్ళ ఎన్నో ప్రయోజనాలు ఉ న్నాయని గుర్తు చేసారు.”సైకిల్ పై ప్రయాణించటం వాళ్ళ మన ఆరోగ్యాన్ని మనమే మెరుగు పరుచుకోవటమే కాకుండా కాలుష్యాన్ని నివారించిన వాళ్ళం అవుతాం.మరీ ముఖ్యంగా మానసిక ఉల్లాసాన్ని పొందుతాం”అన్నారు.ట్రిసిటీ రైడర్స్ వరంగల్ వారు నిర్వహించిన సైక్లింగ్ ఛాలెంజ్ లాంటి కార్యక్రమాలు నగర ప్రజలకు సైక్లింగ్ పై అవగాహన కలిగించటం లో సహా య పడతాయన్నారు.ఇదే స్పూర్తితో మన వరంగల్ నగరం కూడా డచ్ దేశం లోని Utrecht నగరం లాగ ప్రపంచంలో నే బైసికల్-ఫ్రెండ్లీ నగరంలో ఒకటిగా ఎదగాలన్నారు.ట్రి సిటీ రైడ ర్స్ వరంగల్ ప్రెసిడినెట్ ఎం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,సెప్టెంబర్ వర్చ్యువల్ సైక్లింగ్ ఛాలెంజ్ లో భాగంగా 500కిలోమీటర్లు టార్గెట్ పెట్టగా,కర్ణాటక,కేరళ,తమిళనాడు,మహారాష్ట్ర,తె లంగాణ,హర్యానా రాష్ట్రాల నుండి మరియు దుబాయ్ దేశం నుండి మొత్తం 138 సైక్లిస్ట్స్ పాల్గొన్నారు.అందులో 58 మంది 500km టార్గెట్ పూర్తి చేసారు.వరంగల్ నగరంలో 20 మంది పూర్తి చేసారు.కేరళ నుండి మొయిద్దీన్ కుట్టి 2371.85 km తో ప్రధమ బాగమతి గెలుచుకున్నారు.మహిళల్లో హైదరాబాద్ కు చెందిన నిహారిక 1178km ప్రయాణం చేసి మొదటి స్తానం లో నిలిచారు.మొత్తంగా ఈ ఛాలెంజ్ లో సైక్లిస్ట్ లు అందరు కలిసి 60,137km సైకిల్ పై ప్రయాణం చేసారు.ఇటీవల కరోనా లొక్డౌన్ లో హైదరాబాద్ నుండి కన్యా కుమారి,అక్కడి నుండి గోవా,లడఖ్ వరకు వెళ్లి తిరిగి వరంగల్ చేరుకున్న రంజిత్ కుమార్ కు సన్మానం చేసారు.ట్రిసిటీ రైడర్స్ వరంగల్ బాద్యులు రాజా నరేందర్ రెడ్డి,కే విష్ణు వర్మ, పిండి ప్రదీప్ కుమార్,మంజూర్ సయెద్,అనుదీప్ సిరిమి ళ్ల,రాజేష్ కుమార్,శ్యామల,విశాల్,కత్తి అనిల్ కుమార్,భాను ప్రకాష్,వెంకటేశ్వర్ కుమార్,రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here