నోటిఫికేషన్‌ ఇవ్వకుండా..నియామకాలా?వైఎస్‌ షర్మిల

డిచ్‌పల్లి:తెవివిలో ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 50 మందిని నియమించారని ఎందుకని అడిగితే క్రిమినల్‌ కేసులు పెడతామని భయపెడుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అ ధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.మంగళవారం డిచ్‌పల్లిలో నిర్వహించిన’నిరుద్యోగ నిరాహార దీక్షలో’ఆమె పాల్గొని మాట్లాడారు.వైఎస్సార్‌ 2006లో తెవివిని ప్రారంభించి ఏడాదికి రూ.50 కోట్లు ఇవ్వాలని భావిస్తే సీఎం కేసీఆర్‌ నిధులు ఇవ్వట్లేదని విమర్శించారు.తెవివి వీసీ పోస్టు కోసం కేటీఆర్‌కు రూ.2 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.తెవివి స్థాపించి 15 ఏళ్లవు తున్నా అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాల లేదన్నారు.వర్సిటీలో 570 ఎకరాలుంటే పదో వంతు తెరాస నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.నిజాంషుగర్స్‌కు పూర్వవైభవం తీ సుకురావాలని,నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ ఒప్పించారని ఆమె గుర్తుచేశారు.సంక్షేమ పథకాల అమలు చేయడం సాధ్యం కాక పోతే కేసీఆర్‌ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని డిమాండు చేశారు.గుత్ప,ఆలీసాగర్‌ కెనాల్‌ ద్వారా తాగు,సాగునీరు అందించిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు.అప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టునే కాళేశ్వరంలోని 22వ ప్యాకేజీగా చెబుతున్నారని పేర్కొన్నారు.అధికార ప్రతినిధి సత్యవతి,కోకన్వీనర్‌ ఇమ్రాన్‌,ప్రతినిధులు శంకర్‌,శ్రీకాంత్‌,పోతరాజు మదన్‌, కృపాజ్యోతి,అరుణ్‌,కార్యకర్తలు,నిరుద్యోగులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here