మంథని:పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడిం ది.దీంతో ఒకరు మరణించగా,16 మంది గాయపడ్డారు.పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్నది.ఈ క్రమంలో గాడిదుల గండి వద్ద ఓ కారును ఢీకొట్టింది. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.దీంతో కారులో ఉన్న వ్యక్తి మరణించగా,బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన వ్యక్తిని ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌గా గు ర్తించారు.ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.