హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారంటూ దు య్యబట్టారు బండి సంజయ్.దళితబంధుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్ పలు అంశాలపై స్పందించిన విషయం తెలిసిందే.అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పచ్చి అ బద్ధాలు.దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.దళిబంధు పథకంపై స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం మాట్లాడారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను.దళితులకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు కొనిస్తామని చెప్పాం.ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామ న్నాం.ఈ నేపథ్యంలో బండి సంజయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి,కేంద్రమంత్రులను అవమానిస్తారా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.సీఎం సోయిలో లేక ముందే రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు.అర్హులైన వారికి పద్మశ్రీ అవార్డులిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వా నిదేన న్నారు.ఉద్యోగాల కల్పనపైనా సీఎం మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని బండి సంజయ్ అన్నారు.రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మాట వాస్తవం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.మరో 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేసింది నిజం కాదా? అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.చిత్తశుద్ది ఉంటే శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
