6ఏళ్ల సర్వీస్‌ ఉండగానే..స్వచ్చందంగా పదవి విరమణ చేసిన డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఐపీఎస్..?

హైదరాబాద్:సీనియర్ ఐపీఎస్,తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్,స్వేరో అధినేత పేరు దళిత వర్గాలన్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారనే ప్రచారం సైతం ఉంది.అంతేగాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేశారు.ఆ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా పనిచేస్తున్న గ్రామాల్లోనే ఉండాలని “మా ఊరికి రండి.మాతోనే ఉండండి”అనే ప్రత్యే క కార్యక్రమాన్ని చేపట్టారు.హుజురాబాద్‌తో పాటు కమలాపూర్,భీమదేవరపల్లి,హుస్నాబాద్​ప్రాంతంలో ప్రవీణ్​కుమార్ ఈ నినాదంపై ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.అప్పుటికే నక్సలైట్ పార్టీలో పనిచేసిన సానుభూతిపరులను సైతం ‘మా ఊరికి రండి’ కార్యక్రమంలో భాగస్వాములను చేశాడు.దీంతో ఇప్పటికే ఉమ్మడి క రీంనగర్ జిల్లాలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొంత ఆదరణ ఉంది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన ప్రవీణ్​కుమార్ కొతకాలంగా రాజకీయాలపై ఇ ష్టం చూపిస్తారనే ప్రచారం కూడా జరిగింది.అందుకే స్వేరో స్టార్ పేరుతో ఓ సంస్థకు వెనుకనుంచి నాయకత్వం వహిస్తూ ప్రోత్సహిస్తున్నారని గతంలోనే ఆరోపణలున్నా యి.అయినా కూడా ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అంతేగాకుండా ఐపీఎస్ అధికారి అయినప్పటికీ సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి పోస్టు ను ఏండ్ల నుంచి ఆయనకే పరిమితం చేస్తోంది.మరోవైపు ఆయన భార్య లక్ష్మీబాయి కూడా కన్ఫర్డ్ ఐఏఎస్‌గా రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు.స్వచ్చంద పదవి విరమణ పై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్26 సంవత్సరాలు ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాలో పని చేసాను.6ఏళ్ల సర్వీస్‌ ఉండగానే స్వచ్చందంగా పదవి విర మణ చేస్తున్నాను.26ఏళ్లు సర్వీసులో ఒక్క శాతం మాత్రమే పేదలకు సేవలందిచాను.ఇకపై పేదలకు వంద శాతం పేదల పక్షాన ఉండాలనే పదవీ విరమణ చేశాను. కొంత విరామం తీసుకున్న తర్వాత నా ఇల్లును చక్కిదిద్దు కుంటున్నాను.రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చేప్పలేను.హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు.స్వేరోస్‌ లోని విద్యార్ధులేవరూ ఆదైర్య‌ప‌డొద్దు నాకంటే మంచి అధికారులు వస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here